Sunday, December 22, 2024

తండాల తలరాతలు మార్చిన ఘనత కెసిఆర్ దే!

- Advertisement -
- Advertisement -

రాయపర్తి : తండాల తలరాతలు మార్చిన ఘనత కెసిఆర్ దేనని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కెసిఆర్ నాయకత్వములో బిఆర్ఎస్ పాలనలో గూడాలకు మహర్ధశ లభించి, నేడు స్వ‌యం పాల‌నలో స్వ‌తంత్ర పాల‌న సాగించుకుంటూ గ్రామ పంచాయ‌తీలుగా వెలుగొందుతున్నాయి. నాడు 7శాత‌మే రిజ‌ర్వేష‌న్లు ఉండే! నేడు కెసిఆర్ సిఎం అయ్యాక‌ 12శాతానికి రిజ‌ర్వేష‌న్లు పెంచారు. కానీ, టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు గిరిజ‌నుల మ‌ధ్య వ‌ర్గీక‌ర‌ణ‌ చిచ్చు పెడుతున్నాడు. నాడు అభివృద్ధి లేక బాధపడ్డ తండాలే…! నేడు ప్ర‌గ‌తి ప‌థాన న‌డుస్తున్నాయి. మన సీఎం కెసిఆర్ ద‌య వ‌ల్లే జ‌రిగాయి. అందుకు తండా వాసులు కెసిఆర్ కు రుణ ప‌డి ఉండాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.

పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గం రాయపర్తి మండలం ఏకే తండ, సూర్య తండ, బాలాజీ తండ, జయరామ్ తండా(ఎస్), బాలు నాయక్ తండ, దుబ్బ తండ, పానిష్ తండాల్లో వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. మండ‌లంలో తండా బాట నిర్వహించారు. పార్టీ జెండాలు ఆవిష్కరించారు. గ్రామపంచాయతీ నూతన భవనాలకు శంకుస్థాపన, అలాగే సిసి రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, కొన్ని బీటీ రోడ్లకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు, వివిధ గుడు ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేస్తూ మంత్రి రాయపర్తి మండ‌లంలో తండా బాట నిర్వ‌హించారు. అలాగే తండాల‌కు మినీ ఫంక్ష‌న్ హాళ్ళ త‌ర‌హాలో క‌మ్యూనిటీ భ‌వ‌నాలు మంజూరు చేస్తున్న‌ట్లు చెప్పారు.

ఈ సందర్భంగా ఆయా తండాల్లో వేర్వేరుగా జరిగిన సభలలో మంత్రి దయాకర్ రావు మాట్లాడారు. తెలంగాణకు ముందు తండాలు సాగునీరు, లేక‌, మంచినీరు లేక‌, క‌నీస స‌దుపాయాలు లేక తండ్లాడేవి. కనీస సౌక‌ర్యాలు లేక గిరిజనులు ఇబ్బందులు పడ్డారు. తెలంగాణ తర్వాత, కెసిఆర్ సీఎం అయ్యాక తండాల తండ్లాట త‌ప్పించారు. ప్రతి తండాను గ్రామ పంచాయతీ గా మార్చారు. వారి తండాల్లో వారి రాజ్యాన్ని తెచ్చారు. దీంతో మంచినీటి కోసం కిలోమీట‌ర్ల కొద్ది పోయే బాధ త‌ప్పింది. సాగునీటితోపాటు భూగ‌ర్భ జ‌లాలు పెరిగాయి. ఇత‌ర గ్రామాల శివార్లుగా ఉండే తండాల‌కు క‌నీస స‌దుపాయాలు క‌లిగాయి. గ్రామాలకు దీటుగా గిరిజన తండాల అభివృద్ధి పరచిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. ఒక్కో తండాకు రూ.కోటి తో అభివృద్ధి జరిగింది. ఇంకా కోట్లాది రూపాయల సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ప్రతి తండాకు నూతన గ్రామ పంచాయతీ భవనం ఏర్పాటు అవుతుందన్నారు.

ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచిన ఘనత కేసిఆర్ ది అయితే, అదే ఎస్ టి లలో వర్గీకరణ చిచ్చుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నడు. తండాలకు వచ్చే ఆ పార్టీ నాయకులను తరిమికొట్టండి అంటూ…మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణకు ముందు రాష్ట్రంలో తండాలు ఎలా ఉండేవి? ఇప్పుడు ఎలా ఉన్నాయో విశ్లేషించుకోవాలి. తమ పరిపాలనలో ఉన్న రాష్ట్రాల్లో ఇవ్వని హామీలు, తెలంగాణలో కాంగ్రెస్ ఇస్తున్నది. అక్కడ లేనిది ఇక్కడ ఇస్తామంటే నమ్మాలా? ఆ పార్టీ ని నమ్ముకుంటే నట్టేట మునిగినట్లే!. కాంగ్రెస్ వచ్చేది లేదు. ఇచ్చేది లేదు అన్నారు.

3 గంటల కరెంటు కావాలా? 3 పంటల కరెంటు కావాలా?
కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తే మ‌ళ్ళీ క‌ష్టాలు త‌ప్ప‌వు అన్నారు. రైతుల న‌డ్డి విర‌వ‌డానికి 3 గంట‌ల క‌రెంటు చాలంటోంది. 24 గంట‌ల క‌రెంటు కావాలా? 3 గంటల క‌రెంటు కావాలా? 3 పంట‌ల బిఆర్ ఎస్ కావాలా? ప్ర‌జ‌లు తేల్చుకోవాలి. మ‌న కోసం పాటుప‌డుతున్న సీఎం కెసిఆర్ కు, నాకు అండ‌గా నిల‌వాలి. అని మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు. క‌ష్టాల్లో సుఖాల్లో మీతో నేను ఉన్నాను. ఎప్పుడూ ముఖం తెలియ‌ని వాళ్ళు మీ ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నారు. ఈ ఎన్నిక‌లు అయిపోతే వారు వెళ్ళిపోతారని ఆయ‌న అన్నారు.

ఈ సందర్భంగా మంత్రికి తండావాసులు ప్రత్యేకించి మహిళలు సంప్రదాయ పద్ధతుల్లో డప్పు చప్పుళ్ళు, నృత్యాలతో బతుకమ్మలతో ఎదురేగి, కుంకుమ తిలకం దిద్ది, ఎడ్ల బండి పై ఊరేగిస్తూ, బైక్ ర్యాలీ నిర్వహిస్తూ, మంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి బతుకమ్మలను ఎత్తుకున్నారు. ఈ తండా బాట, అభివృద్ధి కార్య‌క్రమాల్లో సంబంధిత శాఖ‌ల అధికారులు, ఆయా తండాల ప్ర‌జ‌లు, స్థానిక‌ ప్ర‌జాప్ర‌తినిధులు, సంబంధిత శాఖ‌ల అధికారులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News