Monday, January 20, 2025

జూ.ఎన్టీఆర్ ను సిఎం చేయాలి: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హనుమకొండ: చంద్రబాబు తెలంగాణలో ఫెయిల్ అయి..అటు ఆంధ్రలో ఫెయిల్ అయి ఎక్కడ పొద్దుబోక బిజెపితో మూలాఖత్ అయ్యి చిచ్చుపెట్టే పని మొదలు పెట్టాడని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబుది కాదని నిజంగా చంద్రబాబుకు టిడిపిపై, ఎన్టిఆర్ పై ప్రేమ ఉంటే ఆంధ్రప్రదేశ్లో జూనియర్ ఎన్టిఆర్ ను అధ్యక్షుడుగా చేసి, ముఖ్యమంత్రి చేయాలని అప్పుడే ఆయన చిత్తశుద్ధి తెలుస్తుంది అన్నారు.

లేకపోతే తెలంగాణలో చంద్రబాబు షర్మిల, కేఏ పాల్ అయినట్టే అవుతారు అని ఎద్దేవా చేశారు. హనుమకొండలో నేడు “రైతు కల్లాలు – కేంద్ర ప్రభుత్వ వైఖరి” పై నిర్వహించిన మీడియా సమావేశంలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చంద్రబాబుపై మాట్లాడారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారి మాటలు… టిడిపి తెలంగాణలో ఫెయిల్ అయి,ఆంధ్రాలో ఫెయిల్ అయి ఎక్కడ పొద్దుపోతలేదని ఇక్కడికి వచ్చి చిచ్చుపెట్టాలని కాంగ్రెస్సోలను కలుపుకొని గతంలో ఒక ప్రయత్నం చేశారు. కానీ ఫెయిల్ అయింది.ఇప్పుడు బిజెపి వాళ్లతో ములాఖత్ అయినట్టు అనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పార్టీ అని ఆయన మధ్యలో వచ్చారన్నారు.

ఎన్టి రామారావు స్ఫూర్తి.. ఎన్టి రామారావు పేద ప్రజలకు చేసిన సేవ ఇప్పటికీ రెండు రాష్ట్రాల్లో మర్చిపోలేదు.పేదల స్కీమ్స్ తెచ్చింది ఎన్టి రామారావు అది నువ్వు కాదని అన్నారు.ఎన్టి రామారావు స్ఫూర్తి తీసుకొని, ఎన్టి రామారావుతో పని తీసుకొని, ఎన్టి రామారావుతో బతికినవు,ఆ తరవాత ఆ కుటుంబాన్ని మోసం చేసినావని మంత్రి తెలిపారు.నీ కొడుకుని ఆంధ్రలో పెట్టి, పాపం హరికృష్ణ బిడ్డను తెలంగాణలో పెట్టావు, అది కక్ష సాధింపు కాదా..?జూనియర్ ఎన్టీఆర్ ను ఏపీలో అధ్యక్షునిగా కోరుకుంటున్నారని,లోకేష్ ని కోరుకోవడం లేదన్నారు.

ఆంధ్రలో జూనియర్ ఎన్టిఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, నీ కొడుకు కావాలని కోరుకోవట్లేదని,కానీ లోకేష్ ని ఎంకరేజ్ చేస్తున్నావని ఆయన అన్నారు.నీకు తెలుగుదేశంతో పార్టీ మీద విశ్వాసం ఉన్నా,ఎన్టిఆర్ మీద ప్రేమ ఉన్నా, జూనియర్ ఎన్టిఆర్ ని తీసుకొచ్చి అక్కడ ముఖ్యమంత్రి చెయి,అప్పుడు తెలుగుదేశం మీద ఎంత విశ్వాసం ఉంది? ఎన్టీ రామారావు మీద ఎంత కృతజ్ఞత ఉందో తెలుస్తుందన్నారు.లేకపోతే షర్మిల, ఏమైందో తెలుసు.. పాల్ ఏమైయ్యాడో తెలుసు… సేమ్ అదే టైపులో చంద్రబాబు అయితడని మంత్రి అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News