Thursday, January 23, 2025

అభివృద్ధి పేరుతో రాజకీయాలు చేస్తారా : ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వరంగల్ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రంగా స్పందించారు. శనివారం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రధాని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడానికి వచ్చారా? లేక రాజకీయం చేయడానికి వచ్చారా?! అంటూ ప్రశ్నించారు. తెలంగాణ పట్ల విషాన్ని, విద్వేషాన్ని నింపుకుని ప్రధాని మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీలో అవార్డులు ఇచ్చి ఇక్కడికి వచ్చి తిడుతున్నారు. తెలంగాణలో గ్రామాలు అభివృద్ధి చెందింది అంటే అది ముఖ్యమంత్రి కెసిఆర్ చొరవతోనే అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News