Sunday, December 22, 2024

రేవంత్ రెడ్డిపై మంత్రి ఎర్రబెల్లి మండిపాటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : డబ్బులకు అమ్ముడు పోయి రేవంత్‌రెడ్డి టికెట్లు అమ్ముకుంటడు.. గోడలకు పెయింటింగ్‌లు వేసే వాడివి.. నువ్వు, నీ బతుకు గురించి ఆలోచించు అంటూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు.  కొడంగల్ లో చిత్తుగా ఓడిపోయావు, బ్రోకరు మాటలెందుకు, దమ్ముంటే రంగారెడ్డి జిల్లాలో పోటీ చేసి గెలువు. రేవంత్ రాగానే కాంగ్రెస్ పని ఖతం అయిపోయింది.

పార్టీ గ్రాఫ్ ఘోరంగా పడిపోయిందన్నారు. 15న బిఆర్‌ఎస్ మ్యానిఫెస్టోతో కాంగ్రెస్‌పార్టీ మెుత్తం పడిపోతది. ప్రజలు మిమ్నల్ని నమ్మే పరిస్థితి లేదు, పక్క రాష్ట్రాలలో 6 గ్యారెంటీలు ఇయ్యని మీరు ఇక్కడ ఇస్తా అంటే ప్రజలు ఎట్ల నమ్ముతరు. ఒకప్పుడు గిరిజన గూడాలను గ్రామ పంచాయతీలు చేస్తాం, రిజర్వేషన్లు పెంచుతాం అని రాజశేఖర్ రెడ్డి అన్నారు ఏ ఒక్క టి చేయలేదని విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News