Thursday, January 23, 2025

రేవంత్‌రెడ్డి 420: మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

వరంగల్  : రేవంత్ నన్ను దద్దమ్మ అంటావా… నీలాగా బ్రోకర్ మాటలు నాకు రావు కాబట్టే నేను దద్దమ్మనే. నీలాగా పార్టీలు మారుతూ ఆ పార్టీలను సర్వనాశనం చేస్తూ పది కోట్లకు, ఇరవై కోట్లకు టిక్కెట్లను అమ్ముకునే సంస్కృతి నాది కాదంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విరుచుకుపడ్డారు. గురువారం సాయంత్రం ఎంపీ రాహుల్‌ గాంధీ, రేవంత్‌రెడ్డిలు మాట్లాడిన మాటలను మంత్రి దయాకర్‌రావు ఖండించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి మాటలకు ప్రజలు మెచ్చుకుంటున్నారని అన్నారు. ఆయన భాష పరిణతలేనిదన్నారు. తాను ఏడు సార్లు పోటీ చేస్తే ప్రజలు ఏడు సార్లు గెలిపించారని అన్నారు. నీలాగా ఒకసారి పోటీ చేసిన కాడా మళ్లీ పోటీ చేయకుండా ఓడిపోయే చరిత్ర నీదన్నారు.

రేవంత్‌రెడ్డి ఒక చిల్లర గాడని దేశమంతా అంటున్నమాటేనని అన్నారు. నీ పార్టీ వల్లే నిన్ను తిడుతున్నారని, పది కోట్లకు, ఇరవై కోట్లకు టిక్కెట్లు అమ్ముకుంటున్నట్లు ఆరోపిస్తున్నారని అన్నారు. ఏబీవీపీ కార్యకర్తగా టిఆర్‌ఎస్‌లో చేరి అక్కడి నుండి టిడిపిలో చేరిన అక్కడ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన చరిత్ర నీదన్నారు. రేవంత్‌రెడ్డి ఐరెన్ లెగ్ అనేది అందరికి తెలుసని, అందుకే కాంగ్రెస్ పార్టీ నాశనం అవుతుందని మీ పార్టీ వాళ్లే అంటున్నారని అన్నారు. నోటుకు, ఓటు కేసులో జైలుకు పోయి నీతులు వల్లించడం నీకే చెందుతుందన్నారు.రేవంత్‌రెడ్డి ఒక 420 అని ఆయన అన్నారు.  ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్టును చదువుతున్న రాహుల్‌ గాంధీకి కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, సింగరేణి గురించి ఏమి తేలుసని అన్నారు. అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి ప్రాజెక్టులు నిర్మించారా అని మంత్రి దయాకర్‌రావు ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విలువ కూడా తెలియని రాహుల్‌గాంధీ లక్ష కోట్ల అవినీతి ఎలా జరుగుతుందని చెబుతున్నారని ప్రశ్నించారు. ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి మాట్లాడాలని హితువు పలికారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News