Thursday, December 26, 2024

మంత్రి సత్యవతికి ఎర్రబెల్లి చీర కానుక

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/ హైదరాబాద్ : బతుకమ్మ ఆడబిడ్డల పండుగ. ఆడ బిడ్డలకు చీరలను చిరు కానుకగా సమర్పించి గౌరవించడం ఆనవాయితీ. ఈ ఆనవాయితీని కొనసాగిస్తూ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మంత్రి సత్యవతి రాథోడ్‌కు సద్దుల బతుకమ్మ సందర్భంగా చీరను చిరు కానుకగా బహూకరించారు. మంత్రి సత్యవతి సైతం ఆ కానుకను సంతోషంగా స్వీకరించారు.
రేవంత్‌రెడ్డిపై మండిపాటు
రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్, చీటర్ అని మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఈ నెల 27 న కెసిఆర్ సభ నేపధ్యంలో సభాస్థలిని, హెలిప్యాడ్ ను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. భూపాలపల్లికి, ములుగుకు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు? అని ప్రశ్నించారు. గిరిజన తండాలకు ఆదివాసులకు ఏం చేశారు? అని మండిపడ్డారు. రాహుల్ గాంధీ.. రేవంత్ రెడ్డి రాసిన స్క్రిప్ట్ చదువుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News