ఆయనకు పాదాభివందనం చేసి, ఆశీస్సులు తీసుకున్న మంత్రి
మనతెలంగాణ/హైదరాబాద్ : జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకల సందర్భంగా నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎంఎల్‌సి, ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సన్మానించారు. ఎంఎల్‌ఎ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి శనివారం శనివారం చుక్కారామయ్యను ఆయన స్వగృహంలో కలిసి ఆయనను సన్మానించి, ఆయనకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్యంపై మంత్రి ఎర్రబెల్లి ఆరా తీశారు. చుక్కా రామయ్య ఆయుఆరోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆనాటి పోరాట స్మృతులను నెమరు వేసుకుంటూ, ఆనాటి అమరుల త్యాగాలను కీర్తించారు. విలీన దినోత్సవాన్ని తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలుగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సిఎం కెసిఆర్ నిర్వహిస్తున్న మూడు రోజుల వేడుకలు, ఏడాదంతా నిర్వహిస్తున్న ఇతర కార్యక్రమాలను ఎర్రబెల్లి దయాకర్‌రావు చుక్కా రామయ్యకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, సిఎం కెసిఆర్‌ను, మంత్రి ఎర్రబెల్లిని చుక్కా రామయ్య ఈ సందర్భంగా అభినందించారు. గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని కొనియాడారు.