Sunday, December 22, 2024

సేవాలాల్ గుడి నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాలకుర్తిలో ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్న సేవాలాల్ మహారాజ్ గుడి నిర్మాణ స్థలాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పరిశీలించారు. శంకుస్థాపన ఏర్పాట్లను చూశారు. స్థలం చదును చేస్తుండగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపారు. అక్కడే ఉన్న సేవాలాల్ గుడి నిర్మాణ కమిటీ సభ్యులతో కొద్ది సేపు మాట్లాడారు.

శంకుస్థాపన రోజున నిర్వహించనున్న భారీ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని పలు సూచనలు చేశారు. వివిధ కమిటీలు వేసుకోవాలని, ఆయా కమిటీలకు బాధ్యతలు అప్పగించాలని చెప్పారు. మహారాష్ట్ర నుండి బంజారా వేద పండితులు వస్తారన్నారు. అలాగే పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా తరలి వచ్చే భక్తుల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. రాష్ట్రంలో మొదటిసారిగా పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఎకరా స్థలంలో అద్భుతంగా నిర్మిస్తున్న సేవాలాల్ గుడి, ఫంక్షన్ హాల్, లంబాడా ల సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉంటుందని చెప్పారు. ఆ రోజు లంబాడాలు తమ సంస్కృతిని ప్రతిబింబిస్తూ సంప్రదాయ వస్త్ర ధారణలో రావాలని మంత్రి సూచించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని వారికి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News