Monday, December 23, 2024

వ్యాపారం బాగుందా.. అంతా మీ దయ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ప్రజా నాయకులు… జనంలో కలిసిపోయినా, వారిని పలకరించినా, జనంతో మమేమయ్యే తీరే వేరుగా ఉంటుంది. మాస్ లీడర్ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఏం చేసినా అదో సెన్సేషన్ గానే ఉంటుంది. ఆదివారం పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు ప్రధాన రహదారిపై మంత్రి హఠాత్తుగా ఆగారు. ఆ రోడ్డు పక్కనే బండిపై ఫ్రూట్స్, సాలాడ్స్ అమ్ముకునే మహిళ దగ్గరకు వెళ్లారు. లస్సీ తాగారు. ఆమెతో మాటామంతి జరిపారు. ఈ జ్యూస్ బండి నీదేనా? వ్యాపారం ఎలా ఉంది? బాగా నడుస్తున్నదా? అంటూ కుశల ప్రశ్నలు వేశారు.

దీంతో ఆ ఫుట్ పాత్ మీద వ్యాపారం చేసుకునే మహిళ… బదులిస్తూ, అంతా మీ దయ సార్, మీరు చూపిన దారి ఇది. మీరిచ్చిన అవకాశం వల్లే… ఇవ్వాళ మా కుటుంబం బతుకుతోంది. మేమే కాదు… చాలా కుటుంబాల బతుకుతున్నాయని వెల్లడించింది. సిఎం కెసిఆర్ దయతో వీధి వ్యాపారులకు కూడా ప్రభుత్వం అండగ నిలుస్తున్నది. రుణాలిస్తున్నది. నా వంతుగా నేను మీకు అండగా నిలబడ్డాను అంతే… అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. మంత్రి నేరుగా తన వద్దకు వచ్చి లస్సీ తాగి, మాట్లాడి వెళ్ళడంతో ఆ మహిళ ఆనందానికి అవధుల్లేవు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News