Monday, December 23, 2024

ఉపాధి కూలీగా మారిన మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

వరంగల్ : ఉపాధి హామీ కూలీల పక్షపాతి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. రాయపర్తి మండలంలోని గట్టికల్ గ్రామ శివారులోని చెరువు వద్ద ఉపాధి హామీ కూలీలు పని చేస్తుండగా ఆ దిశగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రయాణిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆ కూలీలను చూసి ఆగారు. అక్కడే వారితో కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం వారితో కలిసి పారపట్టి మట్టి తవ్వా రు.

అలాగే వాతో కొద్దిసేపు మాట్లాడి కష్టసుఖాలను తెలుసుకొని ఎండల్లో పనులు ఎలా జరుగుతున్నాయి, అంటూ తెలుసుకొని వారి అవసరాలను తెలుసుకొని వారికి ఆయా పనిముట్లు, వస్తువులను పంపిణీ చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి ద యాకర్‌రావు కూలీలతో మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంపై కేం ద్ర వైఖరిని రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న స్పష్టతని కూలీలకు వివరించా రు. గతంలో ఉపాధి హామీ కింద మట్టి తవ్వకాల పనులు మాత్రమే చేపట్టేవారని, ఇందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శా శ్వత ప్రాతిపదికన పనులు చేపట్టి పూర్తిచేసి ఆయా పనులను ఉపయోగంలోకి తెచ్చిందని చెప్పారు.

సీఎం కేసీఆర్ ప్రభుత్వం కూలీల పక్షపాతిగా కార్మికుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్లక్షం చేసినప్పటికీ పెద్దగా పట్టించుకోనప్పటికీ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని ఆలోచినస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తరపున కూలీల శ్రేయస్సు కో రి ఉపాధి హామీ కూలీలకు తట్ట, గడ్డపార, పార వంటి పనిముట్లను త్వరలో పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు తరపున ఉపాధి హామీ కూలీలకు స్టీల్ వాటర్ బాటిల్, లంచ్ క్యారియర్, తదితర వస్తువులను తీసుకెళ్లే వి ధంగా ఓ మంచి బ్యాగును పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కా ర్యక్రమంలో నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News