Thursday, January 23, 2025

దేవాదుల పనులు వేసవి కాలంలోపు పూర్తి కావాలి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

- Advertisement -
- Advertisement -

 

దేవాదుల ప్రాజెక్టు పనులు వచ్చే వేసవి కాలంలోపు పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. పాలకుర్తి నియోజకవర్గం దేవాదుల పనుల పురోగతి పై నేడు హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశలంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్యాకేజీ కింద నాలుగు జిల్లాలు వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్ జిల్లాలు వస్తాయని అన్నారు.

గతంలో కాంట్రాక్టర్ చేయకపోతే సిఎం కెసిఆర్ వద్దకు వెళ్ళి రీ టెండర్ పెట్ట్టించిన్నా అనుకున్నంత ముందుకు పోవడం లేదని ఆవేదన చెందారు. మీరు లోపాలు సరి దిద్దుకుని వేసవి కాలం లోపు పూర్తి అయ్యేలా పని చేయాలని విజ్ఞప్తి చేశారు. 6 నెలలలో పూర్తి చేస్తామని హామీ ఇస్తే మూడేళ్లు అవుతున్నా కావడం లేదని. సిఎం కెసిఆర్ వద్ద దీని మీద రివ్యూ చేస్తారని, అక్కడ రివ్యూ అయ్యేలోపు అన్ని చేయాలని అధికారులను ఆదేశించారు.

మీరు సీరియస్ గా తీసుకోకపోతే ఇబ్బంది అవుతుందని, అందరూ సమన్వయం చేసుకుని పనులు వేగంగా చేయాలని సూచించారు. ఈ సమావేశంలో హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ గోపి, జనగామ జిల్లా కలెక్టరు శివలింగయ్య, చీఫ్ ఇంజినీర్ సుధాకర్ రెడ్డి, ఇంజనీర్లు, కాంట్రాక్టర్స్, అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News