Thursday, December 26, 2024

పాడే మోసిన మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

పాలకుర్తి:   ప్రజలకు కష్టమొచ్చిందని తెలిస్తే పరుగులు తీస్తారు.ప్రమాదం ఉందని తెలిస్తే ప్రత్యక్షమవుతారు.ప్రాణం పోయిందంటే పాడే మోస్తారు.కంటతడి పెడుతారు.ఆయనే పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు.పాలకుర్తి నియోజకవర్గం కొండూరు గుండె రామస్వామి అంతిమయాత్రలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. వివరాలలోకి వెళితే… వరంగల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం, రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, వర్దన్నపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుండె రామస్వామి గారు ఈ రోజు ఉదయం గుండె పోటుతో మరణించారు.

ఈ సమాచారం అందిన వెంటనే మంత్రి హైదరాబాద్ నుంచి కొండూరు చేరుకున్నారు. కొండూరులో రామస్వామి అంతిమ యాత్రలో పాల్గొన్నారు. వారి పాడే మోశారు. కంటతడి పెట్టుకున్నారు. పార్థివా దేహానికి నివాళులు అర్పించారు. స్వర్గియ రామస్వామి కొడుకు తొర్రూరు మునిసిపాలిటీ మాజీ కమిషనర్ గుండె బాబును, కుటుంబ సభ్యులను పరామర్శించారు.గుండె రామస్వామి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News