Monday, December 23, 2024

బిజెపి నేతలతో ఎక్కడైనా చర్చకు సిద్ధం: మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

minister errabelli dayakar rao press meet

హనుమకొండ: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొదటి నుంచి అబద్ధాలు మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశం తెలిపారు. బండి సంజయ్ అబద్ధాలు మాని… వాస్తవాలు మాట్లడడం నేర్చుకోవాలని హెచ్చరించారు. మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని చెప్పార. ఉపాధి హామీ పనులు రాష్ట్రంలో మంచి పద్ధతితో నడుస్తున్నాయన్నారు. ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయిని బిజెపి ఎంపిలు కేంద్రానికి లేఖ రాశారని ఆయన పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో జరగని విధంగా, ఉపాధి హామీ పథకం జరుగుతోందని కేంద్రమే అంటోందని మంత్రి స్పష్టం చేశారు. బిజెపి నేతలతో ఎక్కడైనా చర్చకు సిద్ధమని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News