Thursday, January 23, 2025

Errabelli: రాహుల్ గాంధీకో నీతి.. మీకో నీతా..?: ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

వరంగల్‌బ్యూరో: పరువునష్టం కేసులో రాహుల్‌గాంధీకి రెండేళ్లు శిక్ష విధించి ఆరోపణలు నిరూపించమని అడుగుతున్నారని టిఎస్ పిఎస్‌సి లీకులపై బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలు ప్రభుత్వం పై చేస్తున్న ఆరోపణలు కూడా నిరూపించుకోవాల్సి ఉంటుందని గాలిమాటలు మాట్లాడొద్దని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరాల శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హితవు పలికారు. వరంగల్‌లో మంత్రి దయాకర్‌రావు శుక్రవారం బండిసంజయ్, రేవంత్‌రెడ్డిల ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలు నిరూపించకపోవడం వల్ల రెండేళ్లు జైలు శిక్ష కోర్టు విధించిందని అయినప్పటికి ఆ ఆరోపణలు నిరూపించమని అడుగుతున్నారన్నారు.

బండిసంజయ్, రేవంత్‌రెడ్డిలు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ప్రశ్నాపత్రాల లీకేజీపై ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు ఆధార పూర్వకంగా ఉండాలన్నారు. నోటికొచ్చినట్లు గాలి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. మంత్రి కెటిఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తున్నారన్నారు. బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలు ఆధారాలు లేకుండా నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని, వాటిని దమ్ముంటే నిరూపించాలని సవాల్ చేశారు. తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తున్నారన్నారు. కరోనా సమయంలో సరిగ్గా ప్రతిపక్షాలకు బుద్ధి చెప్పారన్నారు. ప్రశ్నాపత్రాల లీక్ కేసు వేగంగా దర్యాప్తు జరుగుతుందన్నారు. ఆదర్యాప్తులో ఎవరు దోషులో ఎవరు నిర్దోషులో తేలుతుందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం సిఎం కెసిఆర్ అహర్నిశలు పనిచేస్తున్నారన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యమంత్రి కెసిఆర్ సుడిగాలి పర్యటన చేసి వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించి ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారాన్ని చెల్లిస్తున్నట్లు సిఎం కెసిఆర్ జిఒను విడుదల చేశారన్నారు. తక్షణమే రైతులకు ఆడబ్బులు అందుతాయన్నారు. రైతులపై స్పందించి వెంటనే నష్ట పరిహారం ప్రకటించినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు మంత్రి దయాకర్‌రావు ధన్యవాదాలు చెప్పారు.

దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా రూ.3 వేల కంటే ఎక్కువ నష్టం ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. కేంద్ర ప్రభుత్వం నష్టపోయిన పంటలకు రూ.5 వేలు మాత్రమే ఇస్తుందన్నారు. మనసున్న మారాజు సిఎం కెసిఆర్ అని రైతుల పక్షపాతిగా మొదటి నుండి వారి అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడుతున్నారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News