Sunday, December 22, 2024

రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్… చీటర్: మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్: కాంగ్రెస్ పార్టీపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్, ఒక చీటర్, రేవంత్ రెడ్డి అన్ని పార్టీలను ముంచుతు వస్తున్నాడని మంత్రి ఎర్రబెల్లి ఫైర్ అయ్యారు. ఈ నెల 27న మహబూబాబాద్ లో ముఖ్యమంత్రి కెసిఆర్ బహిరంగ సభ నేపథ్యంలో సభస్థలి, హెలిప్యాడ్ ఏర్పాట్లను మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు,సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే శంకర్ నాయక్, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి అంగోత్ బిందు పరిశీలించారు.

అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ… ఈ 27 న మధ్యాహ్నం 2 గంటలకు మహబూబాబాద్ బహిరంగ సభలో సీఎం కెసిఆర్ పాల్గొంటారని చెప్పారు. రాహుల్ సభకు ప్రజలు రాలేదు కాబట్టే రోడ్ షోలు పెట్టీ కాలం వెళ్లదీస్తున్నారని ఆరోపించారు. సంబండ వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందజేసిన గొప్ప సీఎం కెసిఆర్ కే దక్కుతుందన్నారు. బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోని రాష్ట్ర ప్రజలందరూ స్వాగతిస్తున్నారని ఆయన వెల్లడించారు. కేంద్రం అనేక అవరోధాలు సృష్టించిన రాష్ట్ర ప్రగతిని అపని గొప్ప నాయకుడు కెసిఆర్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News