- Advertisement -
హైదరాబాద్ : రాజ్యాంగ రూపకర్తగా, సంఘ సంస్కర్తగా అన్ని రంగాల్లో సేవ చేసిన మహనీయుడు అంబేడ్కర్ అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. శుక్రవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయననకు మంత్రి నివాళి అర్పించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేసిన మహానీయుడు అంబేద్కర్ అన్నారు.
దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని పోరాటం చేసింది అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగంతో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు. దళితుల్లో ఆర్థిక సాధికారత యే లక్ష్యంగా దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రంలో 17 లక్షల దళిత కుటుంబాలకు 1.70 లక్షల కోట్లు కేటాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
- Advertisement -