Thursday, January 23, 2025

శ్రీవారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వచ్చే నెలలో జరిగే శాసనసభ ఎన్నికల్లో బిఅర్ ఎస్ పార్టీ ఘన విజయం సాధించాలని శ్రీ వేంకటేశ్వరుడిని కోరుకున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వెల్లడించారు. బుధవారం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని ఎర్రబెల్లి దంపతులు దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు వారికి స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బిఅర్‌ఎస్ పార్టీ విజయం సాధించాలని, సిఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. బిఅర్‌ఎస్ జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News