Thursday, January 23, 2025

కెసిఆర్ చరిత్రలో నిలిచిపోయారు: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

- Advertisement -
- Advertisement -

Minister Errabelli Dayakar Rao Visits Yadadri Temple

 

కెసిఆర్ చరిత్రలో నిలిచిపోయారు
ఇంద్ర కీలాద్రి తరహాలో యాదాద్రి
చారిత్రాత్మకంగా గుట్టలో దేవాలయ పునర్నిర్మాణం
భక్తులతో మాటా మంతీ
గుంటూరు నుంచి వచ్చిన భక్తులకు మంత్రి ప్రశంస
యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

యాదగిరిగుట్ట: తిరుమల తిరుపతి ఇంద్రకీలాద్రి తరహాలో యాదగిరిగుట్ట యాదాద్రి దేవాలయాన్ని పునర్ నిర్మించి సిఎం కెసిఆర్ చరిత్రలో నిలిచిపోయారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మునుగోడు ఉపఎన్నిక ప్రచారానికి వెళుతూ మంత్రి దారిలో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు దేవాలయ ప్రాంగణంలో కనిపించిన భక్తులతో కొద్దిసేపు మాట్లాడారు. వారి బాగోగులు తెలుసుకుంటూ ఎక్కడెక్కడ నుంచి వచ్చారంటూ వాకబు చేశారు. గుంటూరు నుంచి వచ్చిన ఓ కుటుంబాన్ని పక్కనే కూర్చోబెట్టుకొని కొద్దిసేపు వారితో సంభాషించారు.

వారి వారి ప్రాంతాల ఊర్ల పేర్లను తెలుసుకున్న మంత్రి వారితో గుడి ఎలా ఉంది? గుడిలో దర్శనం బాగా జరిగిందా? ఎక్కడెక్కడ నుంచి వచ్చారు? మీ బాగోలేంటి ? దేవాలయం ఎలా ఉంది? దేవాలయంలోని కట్టడాల గురించి మీకేం అనిపిస్తుంది? అంటూ భక్తులతో మాట్లాడారు. వారితో మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… చరిత్రలో నభూతో నభవిష్యత్తు అన్న చందంగా సిఎం కేసీఆర్ యాదాద్రి దేవాలయాన్ని పునర్ నిర్మించాలని చెప్పారు. దేవాలయం మొత్తం అత్యంత భక్తి ప్రపత్తులతో నిండి ఉందని, నిర్మాణ కౌశలం భక్తి పారవశ్యం పొంగి పొరలే విధంగా జరిగిందని మంత్రి చెప్పారు. కెసిఆర్ సీఎంగా వచ్చిన తర్వాతే దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబం బాగుండాలని, ఆయన తలపెట్టిన కార్యక్రమాలు అన్ని విజయవంతం కావాలని నరసింహ స్వామిని కోరుకున్నట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News