Sunday, December 22, 2024

పొలం గట్లపై దయాన్న..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆపన్నులను ఆదుకోవడంలోనే కాదు.. ఇతరులకు సాయం చేయడంలోను..వ్యవసాయం చేయడంలోనూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తనకు తానే సాటి. నిత్యం ప్రజాసేవ, అధికారిక కార్యక్రమాలు, రాజకీయ వ్యవహారాలు, సమీక్షలు, సమావేశాలు.. ఇలా ఎప్పుడూ బిజీగా గడిపే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఖాళీ సమయం దొరికితే చాలు తన వ్యవసాయ క్షేత్రానికి వెళుతుంటారు.

అక్కడ వేసిన పంటలను చూసి తన్మయం చెందుతుంటారు. వివిధ కార్యక్రమాలలో భాగంగా బిజీగా పర్వతగిరిలో దయాకర్‌రావు శనివారం సాయంత్రం సమీపంలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు. పొలం గట్లపై నడుస్తూ తన వ్యవసాయ క్షేత్రాన్ని మొత్తం కలియ తిరిగారు. పంటలను పరిశీలించారు. వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తున్న వారికి తగు సూచనలు సలహాలు ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News