- Advertisement -
పాలకుర్తి : మహబూబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరులో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎస్సై, కానిస్టేబుల్ రాత పరీక్ష నెగ్గిన అభ్యర్థులకు ఉచిత ఫిజికల్ ట్రైనింగ్ తరగతులలో భాగంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉచిత దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఎర్రబెల్లి ట్రస్ట్ ద్వారా చేసిన కార్యక్రమాలన్నీ సక్సెస్ అయ్యాయని తెలిపారు. ఇవాళ రాత పరీక్ష నెగ్గిన అభ్యర్థులు, దేహదారుఢ్య, ఇంటర్వ్యూ పరీక్షల్లో కూడా నెగ్గాలని ఆకాంక్షించారు. అభ్యర్థులు ఉద్యోగాలు పొంది మంచి స్థానాలకు చేరుకోని మీ కన్న తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తేవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సూచించారు.
- Advertisement -