Saturday, December 21, 2024

మంత్రి ఆశీస్సులతో ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన భార్గవి

- Advertisement -
- Advertisement -

Minister Errabelli financial assistance to student

మనతెలంగాణ/హైదరాబాద్ : పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సహకారంతో వరంగల్ డిసిసిబి నుంచి 15లక్షల 50వేల ఆర్థిక రుణం పొందిన జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం నర్సింగాపురంకు చెందిన సపతి భార్గవి విదేశీ చదువుల కోసం లండన్ బయలుదేరింది. అంతకుముందు తనకు సహకరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కలిసి ఆమె కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత చదువులు చదివి, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచిపేరు తీసుకురావాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో భార్గవి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News