Monday, December 23, 2024

ఎఫ్‌ఎస్‌సీఎస్ సూపర్ మార్కెట్‌ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/పర్వతగిరి: ఐనవోలు మండల కేంద్రంలో నందనం రైతు సేవా సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సూపర్ మార్కెట్‌ను శుక్రవారం రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, బిఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ప్రారంభించారు. అదేవిధంగా ఐనవోలు మండల కేంద్రంలో వెయ్యి మెట్రిక్ టన్నుల గోదామును ప్రారంభించారు.

అనంతరం డీసీసీబీ ఛైర్మన్ మార్నేని రవీందర్‌రావు అధ్యక్షతన ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రితో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ కొండూరు రవీందర్‌రావు, ఖమ్మం జిల్లా డీసీబీ ఛైర్మన్ నాగభూషణం, జిల్లా రైతు బంధు అధ్యక్షురాలు లలితయాదవ్, మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, బ్యాంకు అధికారులు, నందనం సొసైటీ డైరెక్టర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News