- Advertisement -
హైదరాబాద్: పల్లెప్రగతిపై జిల్లాల అధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమావేశం నిర్వహించారు. డిపివోలకు ల్యాప్ టాపులు, డీఆర్డీవోలకు సెల్ ఫోన్లను మంత్రి పంపిణీ చేశారు. దేశానికి మన గ్రామాలే ఆదర్శం, ఈ ఆదర్శాన్ని కొనసాగిద్దామన్నారు. పల్లె ప్రగతి శక్తిని ప్రపంచానికి మరోసారి చాటుదామని ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. రోజూ పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను శుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. చెత్త ద్వారా ఆదాయ మార్గాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మొక్కలకు అనువైన ప్రదేశాలు గుర్తించి, ఆయా చోట్ల నాటాలన్నారు. డీపివోలు, డీఆర్డీవోలు సమన్వయంతో కలిసి పనిచేయాలని సూచించారు. ఐదో విడత పల్లెప్రగతి విజయవంతం చేయడం అందరి బాధ్యతని మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు.
- Advertisement -