Wednesday, January 22, 2025

ములాయం సింగ్ మృతిపై మంత్రి ఎర్రబెల్లి సంతాపం

- Advertisement -
- Advertisement -

Minister Errabelli mourns the death of Mulayam Singh

హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మృతి పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  సంతాపాన్ని వ్యక్తం చేశారు. కేంద్రమంత్రిగా, దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా పని చేసిన ములాయం ఉత్తర ప్రదేశ్, దేశ రాజకీయాలలో క్రియాశీలకంగా పని చేసి, తనదైన ముద్ర వేశారన్నారు. ములాయంసింగ్ కుమారుడు అఖిలేష్ యాదవ్ కు వారి కుటుంబసభ్యులకు మంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News