Sunday, December 22, 2024

ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

Minister Errabelli participated in flag pole in Ram temple

పాలకుర్తి: మహబూబాబాద్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం పరిధిలోని పెద్ద వంగర మండలం ఉప్పర గూడెంలోని రామాలయంలో ధ్వజ స్తంభం ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఘనంగా ధ్వజ స్తంభం ప్రతిష్ఠించారు. ధ్వజ స్తంభానికి నవగ్రహాలకు పూజలు చేశారు. అనంతరం మంత్రికి పూజారులు శాలువాతో సత్కరించి, ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… ఉప్పర గూడెం దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠాపనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఆ దేవుడి కృపా కటాక్షాలు అందరిపైనా ఉండాలని కోరుకున్నారు. సీఎం కెసిఆర్ నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, భవిష్యత్తులో సీఎం నాయకత్వంలో తెలంగాణ బంగారు మయం కావాలని కోరుకున్నట్లు మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News