Monday, January 20, 2025

ప్రతి గ్రామానికి రోడ్ల వసతి ఉండాలన్నది సిఎం కెసిఆర్ ఆదేశం

- Advertisement -
- Advertisement -

 

నల్గొండ: రాష్ట్రంలో అత్యధికంగా రూ.1200 కోట్లు నల్గొండ జిల్లాకే ఇచ్చామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర పురపాలక, ఐ.టి.శాఖల మంత్రి కె.టి.రామారావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగ దీష్ రెడ్డి, రాష్ట్ర రహదారులు, భవనాలు గృహ నిర్మాణ శాఖల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ సమక్షంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి, సంక్షేమంపై గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ…మిషన్ భగీరథ కోసం రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లాకు దాదాపు 6వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామని సిఎం కెసిఆర్ దూరదృష్టి వల్ల వచ్చిన పల్లె ప్రగతి ట్రాక్టర్ల వల్ల గ్రామ పంచాయతీల ఆదాయం గణనీయంగా పెరిగిందన్నారు. కొంతమంది కావాలనే కిస్తిలకు కూడా డబ్బులు అడుగుతున్నారు. రైతు కళ్ళాలు , రైతు వేదికలు కట్టొద్దు అని కేంద్రం అంటోందన్నారు.ఉపాధి హామీ పథకం కింద అత్యంత నాణ్యమైన పనులు చేసిందన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వమే మనకు కేంద్రం నుంచి 703 కోట్లు రావాల్సి ఉండగా 150 కోట్లు రైతు కళ్ళాలకు ఖర్చు చేశామని అన్ని నిధులు ఆపారని ఆరోపించారు. ప్రతి గ్రామానికి రోడ్ల వసతి ఉండాలన్నది సిఎం కెసిఆర్ ఆదేశమని మంత్రి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News