- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ పట్ల కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ పక్షపాత ధోరణి పేదల పాలిట శాపంగా మారిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పనిచేస్తున్న దాదాపు 1.25 లక్షల మంది కూలీలకు రెండు నెలల పనుల నిమిత్తం 110.35 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సి ఉంది.
ఉపాధి పనులు చేసిన కూలీలకు వేతనాలు అందజేయాలని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు శనివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు లేఖ రాశారు. పేదలు చేసిన పనికి వేతనం కేంద్రం రెండు నెలలుగా ఇవ్వకపోవడంతో కూలీలు ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ఈ 110.35 కోట్ల రూపాయలను విడుదల చేయాలని మంత్రి కోరారు.
Minister Errabelli Slams Centre over Upadi Hami Scheme
- Advertisement -