Wednesday, January 22, 2025

యాద్రాదిలో మంత్రి ఎర్రబెల్లి ప్రత్యేక పూజలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటి శాఖ మంత్రి కెటిఆర్ జన్మదినం పురస్కరించుకొని యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ… కెటిఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవనం సాగించాలి అన్నారు. మరిన్ని ఉన్నతమైన పదవులు పొందాలని కోరారు. రాష్ట్రంలో, దేశంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని కూడా ఆకాంక్షించినట్లు మంత్రి తెలిపారు. అంతకుముందు మంత్రి కెటిఆర్‌కు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలను ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News