Saturday, November 23, 2024

వైకుంఠధామాల‌ను ఒక టెంపుల్ మాదిరిగా తీర్చిదిద్దాం: ఎర్ర‌బెల్లి

- Advertisement -
- Advertisement -

Minister Errabelli speech at Assembly

హైద‌రాబాద్: తెలంగాణలోని అన్ని గ్రామాల్లోనూ వైకుంఠధామాల‌ను ఒక టెంపుల్ మాదిరిగా అద్భుతంగా తీర్చిదిద్దామని రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు చెప్పారు. మంగళవారం ఉదయం శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా గ్రామాల్లో వైకుంఠ‌ధామాలు, డంపింగ్ యార్డుల ఏర్పాటుపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి ఎర్రబెల్లి స‌మాధానమిచ్చారు. దేశంలో ఏ రాష్ట్రం చేయలేని విధంగా తెలంగాణ‌లో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. గ్రామాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించారని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామ‌పంచాయ‌తీల‌కు గానూ.. ఇప్ప‌టివ‌ర‌కు 12,672 వైకుంఠ‌ధామాలు, 12,737 డంపింగ్ యార్డుల‌ను ఏర్పాటు చేశామ‌న్నారు. వైకుంఠ‌ధామాల కోసం రూ.1547 కోట్లు, డంపింగ్ యార్డుల కోసం రూ.319 కోట్లు ఖ‌ర్చు చేశామ‌న్నారు. మిగిలిన 147 గ్రామాల్లో వైకుంఠ‌ధామాలు, డంపింగ్ యార్డుల‌ను ఈ ఏడాది అక్టోబ‌ర్ వ‌ర‌కు పూర్తి చేస్తామని తెలిపారు.

వైకుంఠధామాల‌ను ఒక టెంపుల్ మాదిరిగా అద్భుతంగా తీర్చిదిద్దామని, మిష‌న్ భ‌గీర‌థ నీళ్ల‌ను వైకుంఠ‌ధామాల‌కు అందిస్తున్నామని చెప్పారు.ప్ర‌తి ఊరిలో న‌ర్స‌రీ ఏర్పాటు చేసి, ప్ర‌జ‌ల‌కు అవ‌స‌ర‌మైన మొక్క‌ల‌ను అందిస్తున్నామని, పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ కోసం ప్ర‌తి గ్రామానికి ట్రాక్ట‌ర్‌ను కేటాయించామ‌న్నారు. న‌రేగా నిధుల‌ను అద్భుతంగా వాడుకున్నార‌ని ప్ర‌ధాని మోడీ ప్ర‌శంసించారని తెలిపారు. నిధుల‌ను ఏ రూపంలో వాడుకుంటున్నామో అవ‌గాహ‌న తెచ్చుకోవాలి.. కానీ రాష్ట్రం నిధులా? కేంద్రం నిధులా? అన్న ప్ర‌శ్న ఉత్ప‌న్నం కావొద్ద‌ని చెప్పారు.

Minister Errabelli speech at Assembly

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News