Sunday, December 22, 2024

కేజీబీవిని ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి ఎర్రబెల్లి

- Advertisement -
- Advertisement -

జనగామ జిల్లా, చిల్పూరు మండలం, రాజవరం గ్రామంలో నిర్మించిన నూతన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. 45 రోజుల క్రితమే విద్యార్థులు నూతన భవనంలోకి రావడంతో మంత్రి అక్కడి సదుపాయాలను పరిశీలించారు. కేజీబీవీలో వసతులు, వంట గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

తరగతి గదులకు వెళ్లి పాఠాలు చెప్పడం గురించి కూడా కనుక్కున్నారు. వంటశాలకు వెళ్లి వండిన ఆహార పదార్థాలను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి… ఇంకేం కావాలి అని అడిగారు. సీసీ కెమెరాలు, ప్రహరీ గోడ, ల్యాబ్ వసతులు కల్పించాలని విద్యార్థులు కోరడంతో అవన్నీ మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కేజీబీవీ ప్రిన్సిపాల్ ప్రశాంతి, అధ్యాపకులు సిబ్బందితో కలిసి ఫోటో దిగారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News