Sunday, December 22, 2024

బలగం మొగిలయ్యకు మంత్రి ఎర్రబెల్లి పరామర్శ

- Advertisement -
- Advertisement -

మెరుగైన వైద్యం అందించాలని నిమ్స్ వైద్యులను ఆదేశించిన మంత్రి

హైదరాబాద్ : ఎన్నో కుటుంబాలను కలుపుతున్న బలగం సినిమాలో… నా తోడుగా నా తోడు ఉండి అనే పాట పాడిన బుడగ జంగాల కళాకారుడు, కిడ్నీ సంబంధ సమస్యలతో నిమ్స్ లో చికిత్స పొందుతున్న మొగిలయ్యను రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరామర్శించారు.

Also read: పెద్ద సంఖ్యలో ఫైటర్ జెట్లను మోహరించిన చైనా!

శుక్రవారం వారి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. మోగిలయ్య వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని, మంచి వైద్యం అందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడి మోగిలయ్య ప్రస్తుత పరిస్థితిని తెలుసుకున్నారు. వారికి మంచి వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. మంత్రి వెంట బిఅర్‌ఎస్ నాయకులు సాంబారి సమ్మారావు, బుడిగ జంగాల సంఘం నాయకుడు చింతల యాదగిరి, సిఎం ఓఎస్‌డి డాక్టర్ గంగాధర్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News