Monday, December 23, 2024

హజ్ యాత్రికుల చివరి బ్యాచ్‌

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నుండి హజ్ యాత్రకు వెళ్ళే పిలిగ్రిమ్స్ చివరి బ్యాచ్‌కు మంత్రి మహమూద్ అలీ జెండాఊపి ప్రారంభించారు. గురువారం సాయంత్రం హజ్‌హౌజ్ నుండి హజ్ యాత్రికుల చివరి బ్యాచ్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలు దేరింది. అక్కడి నుండి ప్రత్యేక విమానంలో జిద్దాకు హజ్ పిలిగ్రిమ్స్ చేరుకున్నారు. ఈ సందర్భంగా హజ్ యాత్రికులకు మంత్రి మహమూద్ అలీ శుభాకాంక్షలు తెలిపారు. యాత్ర సందర్భంగా తమ ఆరోగ్యాల పట్ల శ్రద్ద తీసుకోవాలని పిలిగ్రిమ్స్‌కు సూచించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ హజ్ యాత్రికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారని వారి సంక్షేమం, మక్కా యాత్ర శుభప్రదంగా జరుపుకుని రావాలని ఆకాక్షించారని అన్నారు. హజ్ యాత్రికులు రాష్ట్రంలో శాంతి, విజయం, మంచి భవిష్యత్తు కోసం ప్రార్థించాలని కోరారు. హజ్ కమిటి చైర్మన్ మొహమ్మద్ సలీం మాట్లాడుతూ హజ్ క్యాంప్ విజయవంతంగా ముగిసినందుకు వివిధ ప్రభుత్వ విభాగాలు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ విమానాశ్రయం నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మొత్తం 7,060 హజ్ యాత్రికులు జిద్దాకు బయలు దేరారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వక్ఫ్‌బోర్డు చైర్మన్ మొహమ్మద్ మసిఉల్లా ఖాన్, హజ్ కమిటి ఇంచార్జి ఈఓ ఎండి లియాఖత్ హుస్సేన్, సభ్యులు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, సయ్యద్ ఇర్ఫాన్ ఉల్ హఖ్( కరీంనగర్), సయ్యద్ నిజాముద్దీన్ (నార్సింగి), ఎండి జాఫర్ ఖాన్ (గజ్వేల్) తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News