Saturday, November 16, 2024

అభివృద్ధి పనులకుమంత్రి ఈశ్వర్ శ్రీకారం

- Advertisement -
- Advertisement -

ధర్మారం: రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ బుధవారం ధర్మారం మండలంలో పర్యటించారు. బంజరుపల్లి తండా బి గ్రామపంచాయతీ పరిధిలో నూతనంగా నిర్మించనున్న సేవాలాల్ మహారాజ ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన విశ్వ బ్రాహ్మణ సంఘ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం నరసింహులపల్లిలో జరిగిన కార్యక్రమంలో మం త్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. సేవాలాల్ జయంతి సందర్భంగా ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు నిర్వ హించడంతోపాటు గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేస్తుందన్నారు.

ఆయన ఆలయ నిర్మాణానికి తనవంతు సహకారం అందిస్తానని అ న్నారు. ధర్మారం మండల కేంద్రంలో విశ్వబ్రాహ్మణ భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వబ్రాహ్మణుల సం క్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నూతన భవన నిర్మాణానికి తమ వంతు సహకారం అందించామని, విశ్వబ్రాహ్మణులు త మ కులవృత్తిని కొనసాగిస్తూ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్ర మంలో జిల్లా సహకార సంఘాల ఫోరం చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, జడ్పీటీసీ పూసుకూరు పద్మజ జితేందర్‌రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు పూసుకూరు జితేందర్ రావు, మండల కోఆప్షన్ రఫీ, ఎంపీడీఓ బీమ జయశ్రీల, జిల్లా రైతుబందు సభ్యులు పూసుకూరు రామారావు, ఎగ్గేల స్వామి, బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి గుర్రం మోహన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు బాస తిరుపతిరావుతోపాటు తండా బి సర్పంచ్, ఎంపీటీసీ, విశ్వబ్రాహ్మణులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News