Monday, January 20, 2025

డిఫరెంట్ వేషాల్లో వచ్చినా.. వీళ్లంతా ఒకే తాను ముక్కలు…..గంగుల కమలాకర్

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ :  తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీలకతీతంగా అందరూ పోరాటం చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ సంపద పెరిగిందని, హైద్రాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిపోయిందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.ఉమ్మడి రాజధాని విషయంలో 10 ఏండ్ల గడువుందని, తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన వై.ఎస్. బిడ్డ వెరైటీ ముసుగుతో ఇక్కడకొచ్చిందని. పవన్ కల్యాణ్, కేఏ పాల్ కూడా వచ్చారని తెలంగాణ సంపదపై వీరంతా కన్నేశారని ఆయన వాపోయారు. ఇప్పుడు అసలు మనిషి చంద్రబాబు ఎంటరయ్యి పాత బిడ్డల్లారా రండి అంటున్నాడు. డిఫరెంట్ వేషాల్లో వీళ్లంతా వచ్చినా అందరూ ఒకే తాను ముక్కలని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మళ్లీ రాష్ట్రాన్ని కలపాలన్నదే వీరి ఎజెండా అని మళ్లీ 1956 నవంబర్ 1 గుర్తుకు తెస్తున్నారని తెలిపారు. ఆ ప్రయత్నంలో భాగమే చంద్రబాబు ఎంట్రీ అని చంద్రబాబు మూలాలు ఎక్కడ? ఏపీ మూలాలున్న మీకు తెలంగాణ గడ్డపై ఏం పని అని మండిపడ్డారు. సీలేరు పవర్ ప్లాంట్ గుంజుకున్న వ్యక్తి చంద్రబాబు అని వీరందరి వెనక ఉన్నది బీజేపీయే అని, కాళేశ్వరం ప్రాజెక్టును పగలగొట్టి మళ్లీ తెలంగాణను ఎడారి చేయాలనుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. మన రాష్ట్ర సంపద, హైద్రాబాద్ సంపద, మన నీళ్లను ఎత్తుకుపోయే కుట్రలో భాగమే ఇదంతా చేస్తున్నారని ఆయన వాపోయారు.

తెలంగాణ ప్రజలు మేల్కోవాలని, తిరుగుబాటు మొదలు పెట్టకపోతే మన పిల్లల భవిష్యత్తు అంధకారమవుతుందని ఆయన పిలుపునిచ్చారు. మన బొగ్గు, మన కరెంట్ ఎత్తుకుపోవడానికి వచ్చారని వాళ్లను పారద్రోలే దాకా వెంబడించాలని కోరారు. తెలంగాణ రక్తం ఉన్న వాళ్లెవరూ చంద్రబాబు పార్టీలో చేరరని, షర్మిల బీజేపీ దూత, వాళ్ల బాణం చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా బీజేపీ బాణాలే అని, నిన్నటి ఖమ్మం సభలో చంద్రబాబు ఏడు మండలాల గురించి, సీలేరు గురించి ఎందుకు మాట్లాడలేదని, 3.6 లక్షల జీఎస్టీ చెల్లించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ర్టమని ఇంత సంపద ఉంది కాబట్టే మన మీద మళ్లీ కన్నేసారని. బీఆర్ఎస్ తో మేము దేశమంతా పోతుంటే.. తెలంగాణ మీదకే వీళ్లంతా ఎందుకొస్తున్నారని ఆయన ప్రశ్నించారు.

మీది జాతీయ పార్టీనే కదా కర్ణాటకలోకో, తమిళనాడులోకో చంద్రబాబు ఎందుకు పోవడం లేదని? మనం ఏనాడు ఏపీ సంపద దోచుకోవాలనుకోలేదని అన్నారు.వాళ్లు గతంలో తెలంగాణను దోచుకున్నవాళ్లు, దోచుకోవాలనుకుంటున్న వాళ్లు కాబట్టే వ్యతిరేకిస్తున్నానని ఆయన ధ్వజమేత్తారు. తల కిందికి పెట్టి కాళ్లు పైకి పెట్టి యాత్రలు చేసినా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థతిలో లేరన్నారు. హైదరాబాద్ లో ఉన్న ఏపీ వాళ్లు కూడా మిమ్మల్ని నమ్మరని, మద్రాసు నుంచి తన్ని తరిమేస్తే సంపద ఎక్కువగా ఉన్న తెలంగాణను ఆనాడు కలిపారని . ఇప్పుడు మళ్లీ వేర్వేరు వేషాల్లో గద్దల్లా తెలంగాణ సంపదను దోచుకునేందుకు వస్తున్నారని అన్నారు. కేసీఆర్ సత్ఫాలన చూసి దేశమంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని. మాకు దేశంలోని నలు మూలల నుంచి వందల ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. ఏపీలో కూడా మాకు అద్భుత మెజార్టీ వస్తుందన్న ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News