Thursday, January 23, 2025

కెసిఆర్ రాష్ట్రానికి రక్షకుడు: మంత్రి గంగుల

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: నిరుపేదలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం గొప్ప వరమని రాష్ట్ర బిసి సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. శనివారం కలెక్టరేట్ ఆడిటోరియంలో కరీంనగర్ అర్బన్, కొత్తపల్లి మండలాలకు చెందిన 142 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదింటి ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలవాలనే ఆలోచన రాలేదన్నారు. స్వయం పాలన లో సిఎం కెసిఆర్ అన్నగా, మేనమామగా నిరుపేద ఇంటి ఆడబిడ్డలకు అండగా ఉంటానని కల్యాణ లక్ష్మి షాదీ, ముబారక్ పథకాన్ని చేపట్టారన్నారు. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలాంటి పథకం అమలు చేయడం లేదన్నారు. గతంలో పాలించిన కాంగ్రెస్, బిజెపి పాలకులు నిరుపేదింటి ఆడబిడ్డల గోసను పట్టించుకోలేదన్నరు. ఆడబిడ్డల వివాహాలకు అండగా నిలువాలనే ఆలోచన వారికి రాలేదని, సంక్షేమ పథకాల అమలు కేవలం కెసిఆర్ కే సాధ్యమన్నారు.

ప్రభుత్వ సంపద పెరగాలి, పెరిగిన సంపద పేదలకు ఇవ్వాలనేదే సిఎం లక్ష్యమని, అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో గొప్ప గొప్ప పథకాలు పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. గతంలో ఎండిపోయిన నారు, కాలిపోయిన మోటర్లు దర్శనమిచ్చేవని, తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక నాణ్యమైన ఉచిత విద్యుత్తు, నీళ్లు రైతుబంధు అందిస్తున్నందున రైతులు భూమికి బరువు అయ్యేంత పంటలు పండిస్తున్నారు. పేద ఆడబిడ్డ పెళ్లయిన నెల రోజుల్లో గానే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ద్వారా చెక్కులు అందిస్తున్నామని, కెసిఆర్ కిట్ తో ఉచితంగా కాన్పులు, ఉన్నత వర్గాలకు ధీటుగా మహాత్మా జ్యోతిబాపూలే గురుకులాల్లో ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 1.25 లక్షల రూపాయలు వెచ్చించి నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. బడుగు బలహీన మైనారిటీ వర్గాల సంక్షేమం టిఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం అన్నారు. ఈ కార్యక్రమంలో వై.సునీల్ రావు, ఆర్డిఓ ఆనంద్ కుమార్, ఎంపీపీలు తిప్పర్తి లక్ష్మయ్య, పిల్లి శ్రీలత, కొత్తపెళ్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, జెడ్పిటిసిలు, కార్పొరేటర్లు, సర్పంచులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News