Monday, December 23, 2024

సిఎంఆర్ గడువు పెంపుపై ఫలించిన మంత్రి గంగుల కృషి

- Advertisement -
- Advertisement -

Minister Gangula efforts on extension of CMR deadline paid off

 

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాలతో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సిఎంఆర్ గడువు పెంపు విషయంలో చేసిన కృషి ఫలించింది. నిరంతరం రాష్ట్ర రైతాంగం గురించి తపించే ప్రభుత్వ యంత్రాంగం రైతులకు లబ్ధి చేకూర్చేందుకు అనుక్షణం తపిస్తూనే ఉంటుందన్నారు మంత్రి గంగుల. అందుకు నిదర్శనంగా రైతుకు అనుకూల నిర్ణయాల కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయన్నారు. 2021-22 వానాకాలం బియ్యాన్ని సమర్పించేందుకు ఈ నవంబర్ 30 వరకు ఎఫ్సీఐ గడువును పెంచిందని నేడు విడుదల చేసిన పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. దీంతోపాటు గత యాసంగి బియ్యం బాయిల్డ్ గా తీసుకునేందుకు మరో నాలుగు లక్షల టన్నులకు అనుమతించిందని దీంతో గతంలో ఇచ్చిన ఎనిమిది లక్షలు టన్నులతో కలిసి మొత్తం 12 లక్షల మెట్రిక్ టన్నుల ఫోర్టిఫైడ్ బాయిల్డ్ రైస్ సేకరణకు మార్గం సుగమమైందన్నారు. తద్వారా రాష్ట్ర ఖజానాకు దాదాపు 180 కోట్లు ఆదా అవుతాయని మంత్రి గంగుల కమలాకర్ హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News