Monday, December 23, 2024

అసని తుపాన్.. ధాన్యం కొనుగోళ్లపై అప్రమత్తం

- Advertisement -
- Advertisement -

Minister Gangula High Level Review on Grain Purchases

రక్షణకోసం 2.77లక్షల టార్పాలిన్లు
అందుబాటులోకి 6.35కోట్ల గోనెసంచులు
ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష

హైదారబాద్: అసని తుపాన్ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ఎటువంటి నష్టాలు జరక్కుండా సంబంధిత అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. బుధవారం నాడు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తన కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ధాన్యం సేకరణ సజావుగా, రైతులకు సంత్రుప్తికరంగా కొనసాగుతుందని తెలిపారు. రైతులు పుకార్లు, గాలిమాటలు నమ్మొద్దని సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 3వేల కోట్ల నష్టానికి వెరవకుండా సకల ఏర్పాట్లతో ధాన్యం కొనుగోలు చేయిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో గోనె సంచుల కొరత లేనేలేదన్నారు. 8.85 కోట్ల గన్నీలకుగాను ఇప్పటివరకూ 2.5కోట్లు వాడామని, ఇంకా 25లక్షల మెట్రిక్ టన్నులకు సరిఫడా 6.35 కోట్లు గోనె సంచులు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. రైతులు కొనుగోళ్లలో ఏ సమస్యలు ఉన్నా టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని సూచించారు. అసాని తుఫాన్ నేపథ్యంలో డీసీఎస్వోలు, డీఏంలు, రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ధాన్యం వెంటనే గోదాములకు చేర్చేలా సమగ్ర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లోనూ సరిపడా టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, మాయిశ్చర్ మిషన్లు ఇతరత్రా అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.

రాష్ట్రంలో ధాన్యం సేకరణ సజావుగా, సంత్రుప్తికరంగా కొనసాగుతుందని ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేవని, పుకార్లు, గాలిమాటల్ని రైతులు నమ్మెద్దని సూచించారు, ముఖ్యమంత్రి 3వేల కోట్ల నష్టాన్ని భరించి కొనుగోళ్లకు ఆదేశాలు జారీ చేసారన్నారు. అసాని తుఫాన్ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు రాకుండా, ధాన్యం తడవకుండా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. గన్నీలు అందుబాటులో లేవని, సౌకర్యాలు లేవని వస్తున్న ఆరోపణల్ని ఖండించారు, 8 కోట్ల 85 లక్షల గన్నీలు ప్రస్థుతం అందుబాటులో ఉన్నాయని ఇందులో ఇప్పటి వరకూ కేవలం 2.5 కోట్ల గన్నీలను మాత్రమే వాడామని, , అవసరమైన మేర అన్ని అందుబాటులో ఉంచుకున్నామన్నారు. అసాని తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, సివిల్ సప్లైస్ శాఖకు చెందిన డీసీఎస్వోలు, డీఎంలు అప్రమత్తంగా ఉండి రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 2,77,866 టార్పాలిన్లు, 11,523 వెయింగ్ మిషన్లు, 11,000 మాయిశ్చర్ మీటర్లు, 4,958 పాడీ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయని, అవసరాలకు తగ్గట్టగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తూ ఆ ప్రకారం అన్నీ అందుబాటులో ఉంచుతున్నామన్నారు.

కొనుగోలు కేంద్రాల్లోకి వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే మిల్లులకు తరలించాలని, ఎక్కడైనా స్టోరేజి కొరత ఉన్నచోట లీజుకు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రంలో మంగళవారం వరకూ 5774 కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించామని, 28జిల్లాల్లో 3760 కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతున్నాయని ,వీటి ద్వారా 1 లక్షా 56వేల మంది రైతుల నుండి రూ.2121 కోట్ల విలువ గల 11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. ఇందులో 10 లక్షల మెట్రిక్ టన్నుల్ని మిల్లులకు తరలించామన్నారు. యాసంగి, వానాకాలం ధాన్యం సీఎంఆర్ గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.ధాన్యం కొనుగోళ్లపై నిరంతరం అప్రమత్తంగా ఉన్నామని, ఎక్కడా ఎలాంటి సమస్యలు లేకుండా చూసుకుంటున్నామని ,ఇప్పటివరకూ రైతుల నుండి ఎలాంటి కంప్లైంట్స్ రాలేదన్నారు, ఎక్కడైనా, ఎవరికైనా ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా 1800 425 00333, మరియు 1967 టోల్ ఫ్రీ నెంబర్లను సంప్రదించాలని మంత్రి గంగుల కమలాకర్ రైతులకు సూచించారు. సమీక్షా సమావేశంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, డిప్యూటీ కమిషనర్ రుక్మిణి, పౌరసరపరాల సంస్థ జీఎం రాజారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News