హైదరాబాద్: రాష్ట్రంలో మిల్లింగ్ ప్రక్రియ కొనసాగుతున్న తీరుపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఎప్.సి.ఐ సీఎంఆర్ పునరుద్దరించిన నేపథ్యంలో మిల్లింగ్ ప్రక్రియ వేగంగా పునరుద్దరిస్తున్నామని, ఇందుకనుగుణంగా బియ్యాన్ని తరలించడానికి ఎప్.సి.ఐ జీఎంను ర్యాకుల మూమెంట్ పెంచాల్సిందిగా మంత్రి గంగుల కోరారు. సీఎంఆర్ గడువును పెంచాల్సిందిగా ఇప్పటికే లేఖల్ని రాసామన్న మంత్రి అన్ని జిల్లాల కలెక్టర్లు, సివిల్ సప్లైస్ అధికారులకు మిల్లింగ్ ప్రక్రియలో వేగం పెంచే విదంగా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద ఉద్రుతి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో మిల్లింగ్ ప్రక్రియ పునరుద్దరించేలా చర్యలు తీసుకోవాలని, వర్కర్లు తరలిపోయిన కొన్ని చోట్ల లేబర్ సమస్యలను సైతం త్వరతిగతిన పూర్తి చేసుకొని రెండ్రోజుల్లో పూర్తి స్థాయి మిల్లింగ్ నిర్వహించే విదంగా రైస్ మిల్లర్లు, సివిల్ సప్లైస్ అధికారులు, డీఎంలు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, కార్పోరేషన్ జీఎం రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా మిల్లింగ్ ప్రారంభం
- Advertisement -
- Advertisement -
- Advertisement -