హైదరాబాద్: తెలంగాణలో ఎపి ప్రభుత్వం చిచ్చు పెట్టాలని చూస్తోందని మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. బిజెపికి బి టీంగా వైకాపా వ్యవహరింస్తోందని గంగుల మండిపడ్డారు. తెలంగాణ సర్కారుతో అనవసరంగా తగాదా పెట్టుకుంటున్నారు… కెసిఆర్ కుటుంబాన్ని ఎవరూ విడదీయలేరు గుంగుల పేర్కొన్నారు. వైఎస్ కుటుంబాన్ని విచ్ఛినం చేసేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి యత్నిస్తున్నారని విమర్శించారు. తల్లి, కుమారుడు, అన్నా చెల్లెల్లను విడదీసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. హరీశ్ రావును టార్గెట్ చేసి ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణ, టిఆర్ఎస్ పై ఎందుకు విషం చిమ్ముతున్నారని ప్రశ్నించారు. ”మా సిఎం, ప్రభుత్వం జోలికి వస్తే తీవ్రంగా స్పందిస్తాం” కెసిఆర్, తెలంగాణ ప్రభుత్వంపై మాట్లాడేవాళ్లకు హెచ్చరిస్తున్నా” అని గంగుల పేర్కొన్నారు. మా జోలికి రాకండి.. రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాల వల్లే తెలంగాణకు వలసలు పెరిగాయని ఆయన వెల్లడించారు. ఒత్తిడిలో ఉన్న సజ్జల… ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదని మంత్రి గంగుల పేర్కొన్నారు.
మా జోలికి రాకుండా ఉంటే మంచిది: మంత్రి గంగుల
- Advertisement -
- Advertisement -
- Advertisement -