Thursday, January 23, 2025

ఎమ్మెల్సీ కవితను పరామర్శించి సంఘీభావం తెలిపిన మంత్రి గంగుల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బీజేపీ నేతలు, కార్యకర్తలు ఎంఎల్సీ కవిత ఇంటిపై దాడి చేసిన ఘటనను మంత్రి గంగుల కమలాకర్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం ఎంఎల్సీ కవిత ఇంటికి వెళ్లిన మంత్రి ఆమెను పరామర్శించి, సంఘీభావం తెలియజేసారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. ప్రధాని, బీజేపీ వైపల్యాలను బలంగా ఎండగడుతున్నందుకే మహిళా అని కూడా చూడకుండా కక్ష కట్టారని, ప్రణాళికా బద్దంగా దాడులు చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలకు ఆస్కారం లేదని, బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రజాస్వామ్యంపై, మహిళలపై గౌరవం లేకుండా ప్రవర్థిస్తున్నారన్నారు. సుస్థిర సంక్షేమ పాలన అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వంపై, నాయకత్వంపై అసత్య ఆరోపణలు, అభూత కల్పనలు చేస్తున్నారని, మత రాజకీయాలు చేస్తూ ప్రజల్లో తీవ్ర విద్వేశాలు కలిగేలా చేస్తున్న కుట్రల్ని తెలంగాణ సమాజం ముక్త కంఠంతో ఖండిస్తుందన్నారు. తెలంగాణ సమాజం యావత్తు ఎంఎల్సీ కవితకి సంఘీబావంగా ఉంటుందన్నారు.

Minister Gangula Kamalakar Meets MLC Kavitha

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News