- Advertisement -
కరీంనగర్: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర బిసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఘనంగా నివాళులు అర్పించారు. కరీంనగర్ కోతిరాంపుర సెంటర్లోని మహాత్మగాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా స్మరించుకున్నారు. గాంధీజీకి నివాళులు అర్పించిన వారిలో నగర మేయర్ సునీల్ రావు, జడ్పీ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, మాజీ ఎమ్మెల్సీ నారదాసు, ఇతర నాయకులు, అధికారులు ఉన్నారు.
- Advertisement -