Tuesday, November 5, 2024

కరోనా సాకుతో ధాన్యం కొనుగోళ్లు నిలిచాయి: మంత్రి గంగుల

- Advertisement -
- Advertisement -

Minister gangula kamalakar review on Grain purchases

హైదరాబాద్: కరోనా సాకుతో దేశంలో ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోయాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కోవిడ్ సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉందన్నారు. ఈ సారి రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని గంగుల పేర్కొన్నారు. అందులో ఇప్పటికే 50శాతం కొనుగోళ్లు పూర్తి అయ్యాయని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 6,850 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. కొనుగోళ్లు పూర్తిచేసి 150 కేంద్రాలు మూసివేశామని చెప్పుకొచ్చారు. కోవిడ్ సమయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో కూలీల కొరత వేధిస్తోందన్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ వల్ల బిహార్ కూలీలు స్వస్థలకూ వెళ్లిపోయారని పేర్కొన్నారు. కొనుగోలు చేసినంత మేరకు ఎఫ్ సిఐ తరలించడం లేదన్నారు. ధాన్యం తడిసిందని రైతులు ఆందోన చెందవద్దని మంత్రి సూచించారు. మద్దతు ధర రూ.1,886 కు కొనుగోలు చేస్తున్నదని మంత్రి గంగుల పేర్కొన్నారు.

Minister gangula kamalakar review on Grain purchases

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News