హైదరాబాద్: రేషన్ కార్డుల జారీని వేగవంతం చేయాలని మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల జారీపై అధికారులతో మంత్రి గంగుల సమీక్ష నిర్వహించారు. సిఎం కెసిఆర్ సంకల్పంతో రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి చాలా పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో రైస్ మిల్లులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రైస్ మిల్లులు ఇండస్ట్రీకి ప్రోత్సాహం ఇచ్చేలా నూతన పాలసీ రూపొందించాలని గంగుల కమలాకర్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 4,15,901 దరఖాస్తులు విచారణ తుదిదశకు చేరుకుందని మంత్రి చెప్పారు. వారందరీకి త్వరగా కార్డులు ఇచ్చి ఒకేసారి రేషన్ అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాల వారీగా ధృవీకరణ ప్రక్రియ వేగంగా జరుగుతోందని చెప్పుకొచ్చారు. కొత్త కార్డుల వల్ల ప్రభుత్వంపై ఎంత భారం పడినా రెడీగా ఉన్నామని తెలిపారు.
Minister Gangula kamalakar review on new ration card