Wednesday, January 22, 2025

బిసిల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట : మంత్రి గంగుల

- Advertisement -
- Advertisement -

కాచిగూడ : బిసిల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసి, అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర బిసి సంక్షేమం, పౌర సరఫరాల శాఖ మంత్రి గుంగుల కమలాకర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర మున్నూరుకాపు మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడలోని మున్నూరుకాపు భవన్‌లోని మ్యాడం అంజయ్య హాల్‌లో వివాహ పరిచయ వేదిక నిర్వహించారు. కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిం చారు. జిల్లా కేంద్రాలలో కూడా మ్యారేజ్ బ్యూరో కార్యక్రమాలతో పాటు నిరంతరం కుల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మున్నూరుకాపు కా ర్పొరేషన్ ప్రభుత్వ పరిశీలనలో ఉందని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని హామి ఇచ్చారు.

పార్లమెంట్ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. ట్రస్ట్ బోర్డులో వివాదాలను త్వరలో పరిష్కరించుకొని మహాసభకు ట్రస్ట్ బోర్డుకి పూర్వ వైభవం తీసుకురావాలని సూచి ంచారు. ఐక్యత వల్లే మున్నూరుకాపుల అభివృద్ధి సాధ్యమవుతుందని, మున్నూరుకాపులు అన్ని రంగాల్లో ముందుండి, ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ట్రస్ట్ బోర్డు సభ్యులు సుంకరి బాల కిషన్ రావు, మహాసభ అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఇక నుంచి మ్యారేజీ బ్యూరో సంవత్సరానికి మూడు సార్లు నిర్వహిస్తామన్నారు. వివాహ పరిచయవేదికకు రాష్ట్రం నలుమూలల నుంచి మున్నూరుకాపు కుటు ంబ సభ్యులతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. వివాహం కొరకు అబ్బాయి, అమ్మయిల పేర్లు ఇతర వివరాలను నమోదు చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో మహాసభ ప్రధాన కార్యదర్శి మంగ ళారపు లక్ష్మణ్, కోశాధి కారి లింగిశెట్టి హనుంతరావు, ఉపాధ్యక్షులు మణికొండ రమేష్, యువకమండలి అధ్యక్షుడు కైలాస రాకే ష్, ప్రధానకార్యదర్శి క్రాంతి, కొండూరు వినోద్‌కు మార్, బిఆర్ జితేందర్, జోన్నాడు శ్రీకాంత్, మహాసభ ప్రతినిధులు సో మారపు అరుణ్‌కు మార్ జైపాల్‌రెడ్డి, వేణుగోపాల్, సత్యేంద్రకుమార్, చెలిమెల రమేష్, ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఫొటో నెం : 25kcg=05

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News