- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న హరితహారం స్ఫూర్తితో.. పర్యావరణ పరిరక్షణకు మేము సైతం అంటూ చిన్నారులు చేస్తున్న కృషిని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు. చల్ల రాము, ప్రవీణ నిజాంపేటవాసులు. వారి పిల్లలు దీశీత, సాహర్ష్ ఇంటికి తల్లిదండ్రులు తెచ్చిన మామిడి పండ్లలోని పిక్కలు ,జీళ్ళు తీసి టిష్యూ పేపర్లు, కవర్లలో జాగ్రత్తపడుతూ వచ్చారు. చిన్న చిన్న మొలకలు వచ్చిన తర్వాత వాటిని కప్పుల్లో ప్లాస్టిక్ గ్లాసులు వేసి పెంచడం ప్రారంభించారు వీరిద్దరూ దాదాపు 200 మామిడి పిక్కలను మొక్కలుగా మార్చారు. వారు చేసిన కృషిని మంత్రి గంగుల కమలాకర్ అభినందించారు.
- Advertisement -