Monday, December 23, 2024

హలాల్ ఉత్పత్తుల నిషేధానికి కేంద్ర మంత్రి పిలుపు

- Advertisement -
- Advertisement -

పాట్నా: బీహార్‌లోనూ హలాల్ ఉత్పత్తులపై నిషేధం విధించాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి గిరిరాజ్ సింగ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ వెంటనే దీనిపై స్పందించాల్సి ఉందని తెలిపారు. హలాల్ ముద్ర అనేది పురాతన జిజ్యా పన్ను వంటిదని, పైగా ఇది క్రమేపీ వ్యాపారాలను కూడా ఇస్లామికరణ చేయడంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిరాజ్ సింగ్ బీహార్‌లోని బెగూసరాయ్ లోక్‌సభ స్థానం ఎంపిగా ఉన్నారు. హలాల్ ఉత్పత్తుల నిషేధం గురించి తాను సిఎం నితీశ్‌కు రాసిన లేఖ ప్రతిని కేంద్ర మంత్రి మీడియాకు వెలువరించారు.

ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను స్ఫూర్తిగా తీసుకుని వ్యవహరిస్తే మంచిదని సూచించారు. ఓటు బ్యాంకు రాజకీయాలకు అలవాటుపడే పార్టీలు ఇటువంటి వాటి విషయంలో ఇకనైనా కళ్లు తెరవాల్సి ఉందని లేకపోతే మధ్యయుగపు ఆనవాళ్లు తిరిగి తలెత్తుతాయని హెచ్చరించారు. కేంద్ర మంత్రి ప్రకటనపై బీహార్‌లోని అధికార జెడియు ఎదురుదాడికి దిగింది. బిజెపి తరచూ పలు విషయాలపై హిపోక్రసీకి దిగుతోందని, బీప్ తినడం వంటి వాటిని రాజకీయాల్లోకి లాగుతోందని నితీశ్ పార్టీ ప్రతినిధి విమర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News