- Advertisement -
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఏయే మంత్రిత్వశాఖలు ఉంటాయో తెలుసుకోడానికి కాంగ్రెస్ నేత రాహుల గాంధీ మళ్లీ స్కూలుకెళ్లి నేర్చుకోవలసి ఉందని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ మంగళవారం వ్యాఖ్యానించారు. 1947 నుంచి 2014 వరకు తరతరాలుగా ఎవరైతే పరిపాలన చేశారో మత్సశాఖకు వారు కేవలం రూ.3682 కోట్లు మాత్రమే కేటాయించారని, నరేంద్రమోడీ ప్రభుత్వం 2014 నుంచి రూ.32000 కోట్లు కేటాయించిందని ఉదహరించారు. ఫిబ్రవరి 2న రాహుల్ పుదుచ్చేరి, కోచి వెళ్లినప్పుడు మత్యకారుల కోసం మత్సశాఖ అన్నది లేదని, తాము అధికారం లోకి వస్తే ప్రత్యేకంగా మత్సశాఖను ఏర్పాటు చేస్తామని ప్రకటించారని మంత్రి గుర్తు చేశారు. అందువల్ల రాహుల్‌ను స్కూలుకు పంపిస్తే ఏయేశాఖలు పనిచేస్తున్నాయో రాహుల్ నేర్చుకుంటారని ఆయన వ్యాఖ్యానించారు.
Minister Giriraj Singh Slams Rahul Gandhi
- Advertisement -