Friday, December 20, 2024

రాష్ట్ర ప్రజల సుభిక్షమే ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పం : మంత్రి జగదీష్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

 

సూర్యాపేట : యావత్ తెలంగాణ సమాజం సుభిక్షంగా ఉండాలి అన్నదే ముఖ్యమంత్రి కెసిఆర్ సంకల్పమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిందే తడవుగా అందుకు అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేసి విజయవంతం అయ్యిందని ఆయన కొనియాడారు. మరికొద్ది గంటల్లో నూతన సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణా ఉద్యమం ప్రారంభించిన రోజున రూపొందించిన ఎజెండా 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టి అధికారంలోకి రాగానే అమలు పరిచిన చరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దని ఆయన తెలిపారు. ఎప్పటికప్పుడు ప్రజల ఆకాంక్షలకు తగిన ప్రణాళికలు రూపొందించి సుభిక్షమైన పాలనను అందించి కొత్త వరవడిని సృష్టించి న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందన్నారు. అదే వరవడి తో నూతన సంవత్సరంలోనూ సంక్షేమం,అభివృద్ధిని సమపాళ్లలో రంగరించి ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టేలా నిర్ణయాలు ఉంటాయన్నారు. అదే సమయంలో ప్రజలు నూతన సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు వారి వారి అభ్యున్నతికి దోహదపడలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News