Thursday, January 9, 2025

పెట్రో ధరలు తగ్గే అవకాశం లేకపోలేదు

- Advertisement -
- Advertisement -

పెట్రో ధరలు తగ్గే అవకాశం లేకపోలేదు
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు నిలకడగా ఉంటే
చమురు కంపెనీలు ఆ దిశగా ఆలోచించవచ్చు
పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిలు ధరలు తగ్గడంపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్ సింగ్ పురి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేవారు. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఇలాగే నిలకడగా ఉండి, చమురు కంపెనీలు గనుక వచ్చే త్రైమాసికంలో కూడా మంచి ఫలితాలు సాధిస్తే అవి ఈ విషయంలో దృష్టి పెట్టగలవని ఆయన అన్నారు. అయితే తాను ఈ విషయంలో ఎలాంటి అధికార ప్రకటన చేసే స్థితిలో లేనని ఆయన స్పష్టం చేశారు. సమయం గడిచే కొద్దీ దీనిపై స్పష్టత వస్తుందన్నారు. శనివారం ఢిల్లీలోని బిజెపి ప్రధాన కార్యాలయం వద్ద జరిగిన విలేఖరుల సమావేశంలో మీడియా ప్రతినిధులు పెట్రోలు, డీజిలు ధరలను తగ్గించే విషయమై అడిగిన పలు ప్రశ్నలకు సమాధానంగా పురి ఈ విషయం చెప్పారు. ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు గత త్రైమాసికంలో సంతృప్తికరమైన ఫలితాలు సాధించినట్లు ఆయన చెప్పారు.‘ తమ నష్టాల్లో కొంత భాగాన్ని అవి పూడ్చుకోగలిగాయి. వాళ్లు మంచి కార్పొరేట్ పౌరులుగా ఉంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే ఏం చేయగలమనే దానిపై పరిశీలిస్తాం’ అని మంత్రి చెప్పారు. ఏప్రిల్ 22నుంచి చమురు ధరలు పెరగకుండా నరేంద్ర మోడీ ప్రభుత్వం చూసిందని ఆయన అంటూ, వినియోగదారులు ఎలాంటి ఇబ్బందీ ఎదుర్కకుండా ప్రభుత్వం చూస్తుందన్నారు.

ప్రతి ఒక్కటీ ఉచితంగా ఇవ్వాలని జనం కోరుకుంటారని, అయితే అది ప్రమాదకరమైన ఉచితాల రాజకీయాల ఉచ్చులోకి నెడుతుందని మంత్రి అన్నారు. ప్రతిపక్షాలు ‘రేవి’్డ (ఉచితాల)రాజకీయాలు చేస్తున్నాయని ఆయన దుయ్యబట్టారు. బిజెపియేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే పెట్రోలు, డీజిలు ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆ రాష్ట్రాలే పెట్రోలు, డీజిలు ధరలను తగ్గించడం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాయని ఆయన అన్నారు. వ్యాట్ తగ్గించకపోవడమే దీనికి కారణమన్నారు. ఈ నేపథ్యంలో పొరుగు దేశాలయిన పాకిస్థాన్, శ్రీలంక దేశాలు ఎదుర్కొంటున్న విద్యుత్ సంక్షోభం గురించి పరోక్షంగా ప్రస్తావించారు. ఈ సందర్భంగా చమురు లభ్యత, ధరలు రెండూ కూడా అదుపులో ఉంచే విధానాలను పాటించినందుకు ఆయన ప్రధాని మోడీని అభినందించారు. మరోవైపు చమురు శుద్ధి సామర్థాన్ని ప్రస్తుతం ఉన్న 252 మిలియన్ మెట్రిక్ టన్నులనుంచి 400 450 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.

ఈ సందర్భంగా భారత వృద్ధి రేటు 5 5.5 శాతానికన్నా మించి ఉండదంటూ అంచనా వేసిన ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌ను మంత్రి ఎద్దేవా చేస్తూ, ఆయన కోరుకుంటున్నది ఇదేనా? అని ప్రశ్నించారు. గత ఆర్థిక సంవత్సరం భారత్ 7.2 శాతం వృద్ధి రేటును సాధించిన తర్వాతనైనా ఆయన తన తప్పును గ్రహించి ఉండాలని అన్నారు. దేశ అభివృద్ధిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను ప్రస్తావిస్తూ ఆయన కంటి చూసును ఒక సారి పరీక్ష చేయించుకుంటూ బాగుంటుందంటూ వ్యంగ్యంగా అన్నారు. యుపిఎ ప్రభుత్వ హయాంలో పదో స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు అయిదో స్థానానికి చేరుకున్న విషయాన్ని పురి గుర్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News