Monday, December 23, 2024

రూ.4.61 కోట్ల చెక్కులను పంపిణీ చేసిన మంత్రి హరీశ్

- Advertisement -
- Advertisement -

Minister Harish distributed cheques worth Rs 4.61 crore

 

సిద్దిపేట: ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన చెక్కులను రాష్ట్ర వైద్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు మంగళవారం పంపిణీ చేశారు. మండల, గ్రామ సమాఖ్య సంఘాలకు కమీషన్లు చెల్లించారు. ఈ నేపథ్యంలో రూ.4.61 కోట్ల చెక్కులను మంత్రి హరీశ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ… వ్యాపారులకు మోడీ రూ.11 లక్షల కోట్లు రుణాలు మాఫీ చేశారని చెప్పారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర పెంచి పేదల నడ్డి విరిచారని ఆరోపించారు. రూ.3 వేల కోట్ల నష్టం భరించి వడ్లు కొంటున్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో గెలిస్తే బాయిల్ రైస్ కొంటామని అమిషా అన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. కేంద్రంలో ఉన్నది బిజెపి కదా.. ఇప్పుడెందుకు కొనట్లేదని మంత్రి ప్రశ్నించారు. వరిధాన్యం కొనుగోలు చేయడం మూలంగా రైతులకు, మహిళా సంఘాలకు లబ్ధి చేకూరుతోంది. కాలేశ్వరం నీటితో జిల్లాలోని చెరువులు, కాలువలు, ప్రాజెక్టులలో నీరు సమృద్ధిగా లభించి ఒక గుంట పొలం కూడా ఎండిపోకుండా సాగు మీరు అందించడం మూలంగా 5 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండిందన్నారు.

కేంద్ర రాష్ట్రాల మధ్య రాజ్యాంగంలో విధులకు సంబంధించిన మార్గదర్శకాలు ఉన్నాయి. దేశ ప్రజలందరికీ ఆహార భద్రత కోసం ధాన్యాన్ని సేకరించాల్సిన కేంద్ర ప్రభుత్వం తొండిగా వ్యవహరిస్తూ వరిధాన్యం కొనుగోలుకు కోర్రీలు పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వంపైన అధికంగా భారం పడుతున్న రైతాంగం సంక్షేమం కోసం ఆలోచించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 3 వేల కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రవ్యాప్తంగా ఏసంగి కాలంలో వారిధాన్యం కొనుగోలును ప్రారంభించడంజరిగింది. తెలంగాణ రాష్ట్రం రాకముందు తెలంగాణా ప్రాంతం నుండి ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు ప్రజలు వలస వెళ్లే స్థాయి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్తు, సాగునీరు, ఎకరాకి 10 వేల రూపాయల ఆర్థిక సాయం, ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచడం, మద్దతు ధరతో దాన్యం కొనుగోలు తదితర వ్యవసాయానికి ఊతం ఇచ్చే చర్యలు మరియు కల్యాణలక్ష్మి, కెసిఆర్ కిట్, రైతుబీమా, మిషన్ భగీరథ, ఆసరా పింఛన్లు తదితర అభివృద్ధి, సంక్షేమ పథకాల మూలంగా రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగి నేడు వరిధాన్యాన్ని దింపడానికి బీహారి వాసులు, వరినాట్లు వేయడానికి కూలీలుగా పశ్చిమ బెంగాల్ నుండి పురుషులు ఉపాధికోసం రాష్ట్రానికి వస్తున్నారు.

గతంలో వరిధాన్యం కొనుగోలుకు మండలానికి లేదా ఐదు, ఆరు గ్రామాలకు కలిపి ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండేవి కానీ ధాన్యం దిగుబడి పెరగడంతో ప్రస్తుతం ప్రతి గ్రామానికి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశాము. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రైతులకు ఇబ్బంది పెట్టకుండా సాఫీగా వరిధాన్యం కొనుగోలు చేయాలి. పిఎసిఎస్ చైర్మన్ లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, అధికారులు, ఐకేపీ అధికారులు వరిధాన్యం కొనుగోలు పగడ్బందీగా పర్యవేక్షించాలి. ఈ సందర్భంగా 215 ఐకెపి, 168 పిఎసిఎస్, 7 ఏఎంసి, 4 మెప్మా మొత్తం 394 కేంద్రాల ద్వారా 2020-21 సీజన్కు సంబంధించి వరిధాన్యం కొనుగోలు కమిషన్ 4 కోట్ల 61 లక్షల 93 వేయిల రూపాయల చెక్కును మరియు 2018-19 సంవత్సరానికి 11 పిఎసిఎస్ కేంద్రాల ద్వారా కొనుగోలు చేసిన మొక్కజొన్న కొనుగోలు కమిషన్ 75 లక్షల 22 వేల రూపాయలు చెక్కును మంత్రివర్యులు మండల సమైక్యలకు మరియు గ్రామైక్య సంఘాలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సుడ చైర్మన్ రవీందర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, పిఎసిఎస్ చైర్మన్ లు, వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, డిఆర్డిఓ గోపాల్ రెడ్డి, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News